- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు పార్టీ ఆఫీస్‌కు చేరుకుని జాతీయపతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పలు సేవాకార్యాక్రమాల్లో పాల్గొని పండులు, దుస్తులు పంపిణీ చేశారు. మరికొందరు అన్నదానం చేశారు. వైయస్ఆర్ (కడప) జిల్లా పులివెందుల ఎమ్మెల్యే కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్న రాష్ట్రంలో మాత్రం ఇంకా ఆరాచక పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు. రాజంపేట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అమర్నాథ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వేకోడూరులో వైయస్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. వైయస్ఆర్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో జెండావిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విజయవాడలో తొలగించిన గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని టీడీపీని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా అద్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అనకాపల్లిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయ గోదావరి జిల్లాలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాకినాడ మండలం జగన్నాథపురంలో వైయస్ఆర్‌సీపీ సిటీ కన్వీనర్ శశిధర్ జెండావిష్కరణ చేశారు. బుట్టాయగూడెంలో ఎమ్మెల్యే బాలరాజు జాతీయపతాకాన్ని ఎగుర వేశారు. గోపాలపురంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్‌రావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జంగారెడ్డిగూడెంలో వైయస్ఆర్‌సీపీ నాయకురాలు సాయిబాబాపద్మ జాతీయ జెండావిష్కరణ చేశారు. చింతలపూడి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ కన్వీనర్ జానకీరెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. కృష్ణా జిల్లా నక్కపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాయకరావు పేట సమన్వయకర్త రామకృష్ణ జాతీయ జెండావిష్కరణ చేశారు. పామర్రులో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెనాలి పట్టణంలోని చౌక్ వద్ద నియోజకవర్గ కన్వీనర్ శివకుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. చిలకలూరిపేట, వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో కన్వీనర్ మర్రి రాజశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంగళగిరి ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ గాంధీ చిత్రాపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు నియోజకవర్గ ఇంచార్జీ అశోక్‌బాబు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. నెల్లూరు వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మువ్వనెల జెండాను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరామిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.