నల్లచొక్కాలతో కదం తొక్కిన యువత

అనంతపురం

29 అక్టోబర్ 2012 : షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు సంఘీభావంగా అనంతపురం యువత నల్ల చొక్కాలతో కదం తొక్కింది. ప్రభుత్వం తీరుకు, ప్రధాన ప్రతిపక్షం డ్రామాలకు నిరసనగా నల్లచొక్కాలు ధరించిన సుమారు ఐదు వందలమంది యువకులు సోమవారం అనంతపురంలో సాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసినందుకు, ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వంతపాడుతున్న టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాము బ్లాక్‌షర్ట్స్‌ వేసుకున్నామని యువకులు చెప్పారు. జగన్ జనం మధ్య ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడుతున్నారనే జైలులో పెట్టారని వార విమర్శించారు. షర్మిల పాదయాత్రలో తన నల్ల బ్యాడ్జీలు ధరించమంటూ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 'అనంత' యువత మాత్రం ఏకంగా నల్లచొక్కాలు వేసుకుని జగన్నోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

తాజా వీడియోలు

Back to Top