నారావారి అంకెల గారడీ

  • బాబు మహిళా వ్యతిరేకని మరోసారి రుజువయ్యింది
  • మహిళల రక్షణపై బాబుకు చిత్తశుద్ధి లేదు
  • మహిళలను అన్ని రకాలుగా మోసం చేశారు
  • అసెంబ్లీ మీడియాపాయింట్ లో రోజా వ్యాఖ్యలు
విజయవాడః బడ్జెట్ చూస్తే బాబు మహిళా వ్యతిరేకి అని మరోసారి ప్రూవ్ అయ్యిందని వైయస్సార్సీపీ  మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఇది నారావారి అంకెల గారడీ తప్ప మహిళలకు ఉపయోగపడేలా లేదని దుయ్యబట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో అసలు, వడ్డీతో కలిపి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారని మండిపడ్డారు.  ఇంకా ఏమన్నారంటే....రూ. 14వేల 200కోట్లు రుణాలుంటే కేవలం 1600కోట్లు రిలీజ్ చేశారు. అది కూడ కార్పస్ ఫండ్ లాగ ఎవరు తీసుకున్నా వడ్డీ కట్టాలి. 8లక్షలమంది డ్వాక్రా మహిళల్ని బాబు నిట్టనిలువునా ముంచేశారు. బాబు  ఇచ్చిన మాట ప్రకారం రూ. 14,200కోట్లు మాఫీ చేసి ఉంటే మహిళలు కాల్ మనీ సెక్స్ రాకెట్ లోకి దింపబడే వాళ్లు కాదు. ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు కాదు. డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా బాబు మహిళలను నాశనం చేశారు. స్త్రీ, శిశు, వృద్ధులు, వికలాంగులు రాష్ట్రంలో 70 పర్సంట్ ఉంటే వాళ్లకు కేవలంరూ. 1750కోట్లు కేటాయించారు. ఈవిధంగా ముష్టి వేసినట్లు వేస్తే ఏవిధమైన అభివృద్ధి జరుగుతుందో బాబు చెప్పాలి. 

మహాలక్ష్మీ పథకం కింద ఆడపిల్ల పుడితే 30వేలు అకౌంట్లో వేస్తానన్నాడు. దేవాంశు పుడితే కోట్లాది రూపాయలు వేస్తున్నాడు తప్ప పేద మహిళ కూతుర్ని కంటే డబ్బులు వేయడం లేదు. పండంటి బిడ్డ పథకం కింద గర్భిణీ స్త్రీకిరూ. 10వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. చివరకు ఆరునెలల పిల్లలకిచ్చే గోరుముద్దల పథకానికి నిధులు కేటాయించకుండా చిన్నబిడ్డలను కూడ మోసం చేశాడు. సైకిళ్లు అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్లకు ట్యాబ్ లన్నారు అవి పక్కనబెట్టారు. బాబు వచ్చాక ఉమెన్స్ మీద 11 శాతం అట్రాసిటీ పెరిగిందని డీజీపీనే చెప్పాడు. వాళ్ల రక్షణ కోసం ప్రత్యేక నిధులు పెట్టలేదు. మహిళల రక్షణపై బాబు చిత్తశుద్ధి లేదు. రాష్ట్రాన్ని అప్పుల భారంలో ముంచి లక్షా 50వేల కోట్లు బడ్జెట్ పెట్టామని సిగ్గులేండా అబద్ధాలు చెబుతున్నారని రోజా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  



Back to Top