వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి న‌గ‌రి మున్సిపాలిటి స‌మ‌స్య‌లు

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి చిత్తూరు జిల్లా న‌గ‌రి మున్సిపాలిటీ స‌మ‌స్య‌ల‌ను మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ శాంత‌కుమారి తీసుకెళ్లారు. మంగ‌ళ‌వారం ఆమె వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ప‌లు స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంంద‌జేశారు. న‌గ‌రి ప‌ట్ట‌ణంలో తీవ్ర తాగునీటి ఎద్ద‌డి ఉంద‌ని, అక్రమ నిర్జన వ్యర్థాల నిర్వహణ, మిశ్రమ పిట్ నిర్మాణం వంటి సమస్యలతో  మున్సిపాలిటీ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు ఆమె తెలిపారు. వేసవి తాగునీటి ఎద్ద‌డి స‌మ‌స్య వేధిస్తుంద‌ని, ఆసుపత్రికి మరిన్ని పడకలు, వస్త్ర ఉద్యానవన అభివృద్ధి, మునిసిపాలిటీలో పన్ను ఎగవేత నిరోధించడానికి ఒక విధానం తీసుకురావాల‌ని శాంత‌కుమారి వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.  
Back to Top