నాగులూరు గ్రామ‌ కన్వీనర్‌గా నాగబాబురెడ్డి

విజ‌య‌న‌గ‌రం:  నాగులూరు గ్రామ క‌న్వీన‌ర్ గా నాగ‌బాబురెడ్డి ఎన్నికైన‌ట్లు రెడ్డిగూడెం మండ‌ల క‌న్వీన‌ర్ పాలంకి మోహ‌న్ ముర‌ళీరెడ్డి తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ..ప్ర‌ భుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల  సమాన్య  ప్రజలు బతుకు జీవనం కొనసాగించడం కష్టతరం అయిందన్నారు.  మండలంలోని  నాగులూరు గ్రామంలో  కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు.  ఈసందర్భంగా  పాలంకి మోహన్‌ మురళీరెడ్డి మాట్లాడుతూ గ్రామ గ్రామాన పార్టీని మరింతబలోపేతంచేసేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతుందని  ప్రభుత్వం అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చేప్పేందుకు సిద్దంగా ఉందన్నారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని జగనన్నతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందన్నారు.   అనంతరం  గ్రామ పార్టీ కన్వీనర్‌గా  ఎం. నాగబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పార్టీ  ఉపాధ్యక్షుడిగా బజారు కొండలరావు, కమిటీ సభ్యులుగా రాము,  నాని,  నాగరాజు,  వెంకటేశ్వరరావు,  మల్లేల కొండలరావు,  బి. నాగరాజు,  వీర్ల జమలయ్య, అడపా సూరిబాబులను ఏకగీవ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  రెడ్డిగూడెం సోసైటీ అధ్యక్షులు గుడిసె ప్రభాకరరెడ్డి, రెడ్డిగూడెం ఎంపీటీసీ3 చాట్ల రాబర్టు, రంగాపురం మాజీ ఎంపీటీసీ కత్తుల వెంకటరెడ్డి,  ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి,  కలకొండ రామారావు,  తదితరులు పాల్గొన్నారు.  

Back to Top