నేటి షర్మిల పాదయాత్ర ఇలా....

మహబూబ్‌నగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం మహబూబ్‌నగర్‌లోని జేజే గార్డెన్సు నుంచి ప్రారంభమవుతుంది.  ఏనుగొండ, హౌసింగ్ బోర్డు, అప్పనాపల్లి, నక్కలబండ తండా మీదుగా జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్టాండు, కౌరంపేట చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం సెంటర్, నేతాజీ చౌక్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడుతారు. ఆ తర్వాత సిగ్నల్‌గడ్డ, ఇందిరా గాంధీ విగ్రహం సెంటర్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన  శిబిరంలో శ్రీమతి షర్మిల ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం 17.3 కి.మీ యాత్ర కొనసాగిస్తారు.  పార్టీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఈ వివరాలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top