జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, 21 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 40వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరుపుకున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు దుప్పట్లు, పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

     శ్రీ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలని కోరుకుంటూ గురువారం అర్ధరాత్రి నుంచే  సర్వమత ప్రార్థనలు చేశారు. వైయస్ఆర్ జిల్లాలో పార్టీ శ్రేణులు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విశాఖపట్నంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.  వికలాంగులకు వీల్‌చైర్‌లు అందజేశారు. వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పండ్లు పండ్లు పంఫిణీ, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

     శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. అనంతరం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, జనక్ ప్రసాద్, గట్టు రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.

    చంచల్‌గూడ జైలు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కేక్ కట్ చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా జైలు వద్దకు తరలి వచ్చారు. దాంతో జైలు పరిసర ప్రాంతం జనంతో కిక్కిరిసి పోయింది.

      హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మల్కాజ్‌గిరిలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్ చౌరస్తాలో చండీయాగం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ఉప్పల్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మేడ్చల్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు పాలు, పండ్లు పంచారు.
    
      కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేష్ట్య రమేష్‌బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు పండ్లు పంపిణీ చేశారు.  నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంచారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. మదిరలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. భద్రాచలంలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జక్కంపూడి విజయలక్ష్మీ, ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.  పి.గన్నవరంలో పేదలకు చీరలు, దుప్పట్లు, రోగులకు పండ్లు పంచారు.

      నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదురి కరుణ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాలిగౌరారం మండలంలో సంకినేని వెంకటేశ్వరరావు వర్గీయులు విద్యార్థులకు స్వీట్లు, రోగులకు పండ్లు పంచారు. కోదాడలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అనాధ, వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో పేదలకు పాలు, పండ్లు పంచారు.
     విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే ఆర్‌వీ కృష్ణరంగారావు ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అనాథ ఆశ్రమంలో వేడుకలు జరిపారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కేసరగుట్ట కాలనీలో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా జహిరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

Back to Top