మసీద్‌లో టీడీపీ నేతల రాజకీయంతూర్పు గోదావరి: అనపర్తి మసీద్‌లో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను అనపర్తి ముస్లిం సోదరులు కలిశారు. నాలుగేళ్లుగా వక్ఫ్‌ బోర్డు కమిటీలో  నియమకాలు జరుపకుండా టీడీపీ నేతలను నియమిస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించడం మంచి సాంప్రదాయం కాదని వారు తెలిపారు.  మసీదుల్లో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై వైయస్‌ జగన్‌కు ముస్లింలు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ..మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top