ముమ్మరంగా ‘జగన్ కోసం.. జనం సంతకం’

హైదరాబాద్:‌ కోటి మందితో ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అఖండ ఆదరణ లభిస్తోంది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసినందుకు, సిబిఐ పక్షపాత ధోరణికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన కోటి సంతకాల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణం, అనంతరం చోటుచేసుకున్న రాజకీయ కుట్రలు, కాంగ్రెస్-‌ టిడిపి కుమ్మక్కవడం, ఉప ఎన్నికలకు ముందు హఠాత్తుగా శ్రీ జగన్మోహ‌న్‌రెడ్డిని అరెస్టు చేయించిన వైనం, ఆ తరువాత సిబిఐ లీకులు, బెయిల్ పిటిష‌న్ విచారణకు వచ్చిన ప్రతిసా‌రి అసత్య కథనాల డ్రామాలను ప్రజలకు వివరించి.. శ్రీ జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా ‌జనకోటి వద్ద సంతకాలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ విషయం తెలిసి జనమే స్వచ్ఛందంగా పార్టీ నేతలు, కార్యాలయాల వద్దకు వచ్చి సంతకాలు చేస్తుండడం విశేషం. తాము సంతకం చేయడమే కాకుండా తమ కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకు వచ్చి సంతకాలు చేయిస్తూ శ్రీ జగన్‌పైనా మహానేత కుటుంబం పైనా తమకు ఉన్న అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైయస్‌ఆర్‌సిపి నేతలు ఎవరైనా రోడ్లపై పార్టీ జెండాతో కనిపిస్తే చాలు .. కోటి సంతకాల గురించి ఆరా తీస్తున్నారు. సంతకాలు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనకోటి సంతకం కార్యక్రమాన్ని ప్రజలు, అభిమానులకు మరింత చేరువ చేయడానికి వైయస్‌ఆర్‌సిపి ఇంటర్నెట్‌ ద్వారా కూడా సంతకాల సేకరణ ప్రారంభించింది. www.ysrcongress.com సైట్‌లో ఈ సంతకాలకు ప్రత్యేకంగా లింక్ ఏర్పాటు చేసింది. ఈ సై‌ట్‌లోకి వెళ్లి ‘జగన్ కోసం.. జనం సంతకం’ లోగో మీద క్లి‌క్ చేసి తర్వాత అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించడం ద్వారా‌ కూడా ప్రజలు జనకోటి సంతకంలో పాల్గొనవచ్చు. లేదా www.ysrcongress.com/home/koti_santhakaalu.htm లింక్‌ను నేరుగా బ్రౌజర్‌లో ఓపెన్ చేయడం ద్వారా కూడా ఆ సంతకాల పేజీకి చేరుకోవచ్చు. అడుగున ఉండే రెండు ఆప్షన్లలో (1. కోటి సంతకాల ఫా‌మ్ డౌ‌న్‌లోడ్ చేసుకుని సంతకం చేసి వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ కార్యాలయానికి పంపడం, 2. ఆ‌న్‌లైన్‌లో నేరుగా సంతకం చేయడం) ఏదో ఒక దాని ద్వారా సంతకం చేయవచ్చు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత.. ఆ పత్రాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలని‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.
Back to Top