<strong>ముంబై, 31 డిసెంబర్ 2012:</strong> జననేత శ్రీ వైయస్ జగన్‌ను అక్రమంగా నిర్బంధించడంపై మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టడానికి నిరసనగా ముంబైలోని పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో పాల్గొన్నారు.<br/>ముంబైలోని శివాజీనగర్‌లో నిర్వహించిన 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు. వైయస్‌ఆర్‌సిపి స్థానిక నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, శ్రీ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌ను అక్రమంగా ఆరు నెలల నుంచి జైలులో పెట్టారని, ఆయనకు బెయిల్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించడానికి నిరసన తెలుపుతూ తామంతా ముంబైలో సంతకాల కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.<br/>