<span style="text-align:justify">తిరుపతి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్ర నారాయణకు పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కింది. తిరుపతి పట్టణానికి చెందిన ముద్రను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అదే విధంగా చిత్తూరు నగరానికి చెందిన పి. రాజాను జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా, బీఎస్ మునాఫ్‌ను జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. <br/></span>