నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. సైదాపురం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం కావడంతో వైయస్ జగన్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, సంక్షేమ పథకాలన్నీ కూడా నీరుగార్చారని మేకపాటి తెలిపారు. వైయస్ జగన్ నాయకత్వంపై రోజు రోజుకు మద్దతు వెల్లువెత్తోందన్నారు. ప్రతి చోట కూడా ప్రజా స్పందన గొప్పగా ఉందన్నారు. ఊర్లకు ఊర్లు కదిలివచ్చి వైయస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పారు. సైదాపురం గ్రామం వద్ద వైయస్‌జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయిని దాటుతుందని, ఈ సందర్భంగా ఓ ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.