విభజన బిల్లుపై సుప్రీంలో మేకపాటి పిటిషన్

‌న్యూఢిల్లీ:

లోక్‌సభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.‌ ఈ మేరకు ఆయన బుధవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి సుశీనల్ కుమా‌ర్ షిండే చేసిన ప్రతిపాదన ఆమోదిస్తూ అక్టోబ‌ర్ 3 న కేబినె‌ట్ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిష‌న్‌లో మేకపాటి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ పునర‌్వ్యవస్థీకరణ బిల్లు-2013ను చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించినట్టు ప్రకటించి ఆదేశాలు జారీచేయాలని సుప్రీం కోర్టుకు మేకపాటి విజ్క్షప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదించిన తీర్మానాన్ని‌ మేకపాటి సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.‌

Back to Top