ప్రతిపక్ష నాయకుడిని విమర్శించేందుకే మహానాడు సబలా...?

రేపల్లెః ప్రతిపక్ష నాయకుడిని విమర్శించేందుకే తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు నిర్వహిస్తున్నదని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మహానాడులో పార్టీ సభ్యుల కంటే అధికార యంత్రాంగం చేస్తున్న హడావుడి ప్రజలందరికి ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.  సీఎం నుంచి మంత్రి వర్గం వరకు వేదికపై మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రాజీకీయ విలువలు ఏ విధంగా దిగజారుతున్నాయనటానికి ఉదాహారణ నిలుస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, మహిళల రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశామని చెబుతూ భారతదేశంలో ఎవరూ చేయలేని విధంగా సంక్షేమ పధకాలు నూటికి 200శాతం అమలు చేస్తున్నామని, ప్రజలకు దగ్గరయ్యామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ప్రజలకిచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేసినట్లు పాలకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజలే చెబుతున్నారన్నారు. ఆ వేదికను అబద్దాలు చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నాయకుడిని తిటేందుకే నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర అభివృద్ధికి మంచి సందేశాన్ని ఇవ్వాల్సి ఉండగా ఈ విధంగా కాకుండా ప్రతిపక్షాలను విమర్శించేందుకే వేదికను వినియోగిస్తున్నారని, రాష్ట్ర ప్రజానికాన్ని 200శాతం మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తీరుతెన్నులు ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో వైయస్సార్‌ సీపీ పట్టణ, రూరల్‌ కన్వీనర్‌లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదే వెంకయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top