విస్తృతంగా ఎమ్మెల్సీ ప్రచారం

కర్నూలు:  రాయలసీమ పట్టభద్రుల పశ్చిమ నియోజక వర్గం వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సోమవారం ఆదోని నియోజక వర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, కార్యదర్శి ప్రసాదరావు, పట్టణ అధ్యక్షుడు దేవా, నాయకులు నజీర్‌వలి, రవి పట్టణంలోని కళాశాలలకు వెళ్లి ప్రచారం చేశారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు, పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌రెడ్డికే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ముద్రించిన ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. పట్టభద్రుల సమస్యలు  వెన్నెపూస గోపాల్‌రెడ్డి ద్వారానే పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. 
Back to Top