అధినేతతో భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటలో శాసన మండలి అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు గాను పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్లనాని, ఆళ్లగడ్డ నాయకుడు గంగుల ప్రభాకర్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సాయంత్రం వారు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆళ్ల నాని మాట్లాడుతూ..ప్రజా సేవ చేస్తారని ఓట్లు వేసి టీడీపీ నేతలను గెలిపిస్తే..ప్రజలనే దోచుకుని తినే నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల సమస్యలు చట్టసభకు తీసుకుని వచ్చేందుకు వైయస్‌ జగన్‌ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటానని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆళ్లనాని తెలిపారు.

ఊహించలేదు: గంగుల ప్రభాకర్‌ రెడ్డి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తారని ఊహించలేదని గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తనను, ఆళ్లనానిని ఎంపిక చేసినందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపినట్లు గంగుల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. తనపై పెట్టిన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేస్తానని పార్టీలో చేరే రోజు చెప్పానని తెలిపారు. వైయస్‌ జగన్‌ రుణం తీర్చుకుంటానని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలను చట్టసభలో అడ్డుకుంటామన్నారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నవారు హుందాగా ముందుకు వెళ్లాలి తప్పా? కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. మొన్న వైజాక్‌లో కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. ఎవరైనా అధికారంలో ఉండవచ్చు అని, అధికారులు చట్టబద్ధంగా వ్యహరించాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top