బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ..

నూజివీడు:

శ్రీరామనవమి ఉత్సవాల్లో కలుషిత పానకం సేవించి అస్వస్థకు గురైన భక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు చికిత్స పొందుతున్న బాధితులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావులు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వారి వెంట రాష్ట్ర కమిటీ సభ్యుడు నరేడ్ల వీరారెడ్డి ఉన్నారు.

Back to Top