వైయస్‌ విజయమ్మకు తాడిపత్రి ఎమ్మెల్యే సీటు కానుకగా ఇస్తాం

– వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం.
– జేసీ సోదరులు హత్యరాజీయాలకు పాల్పడుతున్నారు..
–జేసీ కుటుంబంతో నష్టపోయాను..
– వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటా..
– ప్లీనరీ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి


తాడిపత్రి టౌన్,తాడిపత్రి రూరల్‌ : జేసీ సోదరుల దౌర్జన్యాలు, ధన దోపిడి, మాట దురుసుతనం, హత్యరాజకీయాలతో నియోజకవర్గంలోని ప్రజలు విసుగు చెందారు. జేసీ సోదరుల పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎప్పుడా అని ఎదురు చేస్తూన్నారు.. 2019 జరగనున్న తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ జెండా ఎగుర వేసి, ఎమ్మెల్యే సీటుకు తాడిపత్రి అడపడచు అయిన దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సతిమణీ అయిన వైయస్‌ విజయమ్మకు కానుకగా ఇస్తామని వెయస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పుట్లూర్‌ రోడ్డులోని ఎస్‌బీఎం పంక్షన్‌ హాలులో సోమవారం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ సోదరుల ఆరాచకాలు రోజు రోజుకు అధికమౌతున్నాయని, దీంతో ప్రజలు మాట్లాడాలంటే భయం .. భయంతో బ్రతుకుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నియోజవర్గలో వైఎస్సార్‌ సీపీలో చురుగ్గా పని చేసే నాయకులు,కార్యకర్తలను జేసీ సోదరులు భయబ్రాంతులను చేస్తున్నారన్నారు. అంతకు మాట వినకపోతే హత్య చేసేందుకు వెనుకడారన్నారు. వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా లబ్ది పోందిన జేసీ సోదరులు వైఎస్‌ విజయమ్మను దూషించడం శోచనీయమన్నారు. అభివృద్ది పేరుతో బ్రోకర్స్‌ను నియమించుకోని ప్రజా ధనాన్ని దండుకుంటున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. తాడిపత్రి పట్టణ అభివృద్దికి గ్రానేటు యజమాన్యాలు కప్పం కట్టాలన్న ఆదేశాలను పాటించడకపోవడంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వారి అభివృద్దికి అడ్డం వేశారన్నారు. పట్టణంలో అధిక సంఖ్యలో మాట్కా కంపేనీ జేసీ సోదరుల అండతో నడుస్తున్నాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే అండ ఉందని పోలీసులు చెప్పడం హస్యస్పదనమన్నారు. పరిశ్రమల వల్ల జేసీ సోదరులు అభివృద్ది చెందారే తప్ప ఏ ఒక్కరు అభివృద్ది చెందలేదని పెద్దారెడ్డి ఆరోపించారు. రెడ్డి కులాన్ని ద్వేషిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్ల ముందు తాకట్టు పెట్టారని అయన ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ,వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగినా సహించేదిలేదన్నారు. వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. జేసీ స్వంత ఊరు జూటూరులో రైతుల నుండి తక్కువ ధరలకే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. భూములను తక్కువ ధరకే జేసీ కుటుంబంతో నష్టపోయిన వ్యక్తిని నేను. వారి అరాచాలకు అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు,కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. ఈసమావేశంలో మాజీ ఎంపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడి,్డ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ,ప్లీనరీ పరిశీలకుడు శివరామిరెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు సూర్యనారాయణరెడ్డి, జిల్లా యూత్‌ విభాగ అధ్యక్షులు సాంబశివారెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి ,కౌన్సిలర్‌ మున్నాతోపాటు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top