పళ్లికొండేశ్వరుని సేవలో ఎమ్మెల్యే రోజా

చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా గురువారం సురుటపల్లి పళ్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయగురుక్కళ్, ఆలయ సిబ్బంది సాదరపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలోని వాల్మీకేశ్వరుడు, మరగదాంబిక, దాంపత్య దక్షిణామూర్తి, రామలింగేశ్వరుడు, పళ్లికొండేశ్వరస్వామి, ప్రదోష నందీశ్వరుని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ అర్చకులు పళ్లికొండేశ్వరస్వామి మెమెంటోను అందించారు.

Back to Top