ఎమ్మెల్యే రాచమల్లు రిలే నిరాహార దీక్ష


వైయస్‌ఆర్‌ జిల్లా:  ప్రొద్దుటూరు నగరంలో పాతబస్టాండ్‌ను కూల్చివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో ఉందని, 40 మంది కౌన్సిలర్స్‌ వ్యతిరేకించిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వరదరాజులు చెప్పారని, మున్సిపల్‌ చైర్మన్‌ ఆదేశించారని ఇలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
 
Back to Top