చిత్తశుద్ధి గల నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

విజయనగరంః దివంగత మహానేత వైయస్‌ఆర్‌ తర్వాత ప్రజల కోసం కష్టపడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు.ప్రజల కన్నీరు తుడవడానికి మారుమూల గ్రామాల్లోకి సైతం వైయస్‌ జగన్‌ నడుచుకుని వస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ భరోసానిస్తూ ముందుకు సాగడం ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం,చిత్తశుద్ధికి  నిదర్శనమన్నారు.ప్రజలందరూ జననేత వైపు చూస్తున్నారని ఆయన వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.విజయనగరంలో జిల్లాలో ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష ప్రజాదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినే గెలుపించుకుంటామని మహిళలు,యువత, రైతులు, అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.
Back to Top