న‌న్నెవ‌రు కొన‌లేరు


 

 విజయనగరం: తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, న‌న్నెవ‌రూ కొన‌లేర‌ని  సాలూరు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్‌లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top