అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే ముస్తఫా

విజయవాడః వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు చాంబర్, ఎల్పీ కార్యాలయానికి గదిని కేటాయించాలని కోరారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ముస్తఫా అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. అందరికీ గదులు కేటాయించి ప్రతిపక్షాన్ని పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా స్పీకర్ చొరవ తీసుకొని గదులు కేటాయించాలన్నారు.

Back to Top