హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులుతో తనకు విడతీయరాని అనుబంధం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమయాజులు మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు, ఇతర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సహకరించిన వ్యక్తుల్లో సోమయాజులు ఒకరన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను క్షుణ్ణంగా విశ్లేషించగల గొప్ప ఆర్థిక వేత్త అని కొనియాడారు.