విద్యావంతులు బాబు జిమ్మిక్కులను నమ్మరు


నందికొట్కూరు:  బాబు వస్తే జాబ్‌ వస్తుందని ఎన్నికల సమయంలో  నిరుద్యోగులకు హామీ ఇచ్చి నట్టేట ముంచేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. విద్యావంతులు బాబు జిమ్మిక్కులను ఇక  నమ్మరన్నారు. నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్‌ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌  సత్యనారాయణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  అధికారంలోకి రాగానే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.  ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయని   తూతూ మంత్రంగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యావంతులు బాబు జిమ్మిక్కులను ఇక  నమ్మరన్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం తొలగించిన చరిత్ర  చంద్రబాబుదేనని తెలుసుకున్నారన్నారు.  

Back to Top