బాబు హైటెక్‌ వ్యవసాయం..లోకేష్‌ ట్విట్టర్‌లో సేద్యం

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చిత్తూరు: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వ్యవసాయం దిగజారిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్‌ వ్యవసాయం చేస్తే, ఆయన కొడుకు లోకేష్‌ ట్విట్టర్‌లో సేద్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెమ్మలగుంటపల్లిలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతన్న రాజ్యం రావాలంటే మళ్లీ రాజన్న రాజ్యం కావాలన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతే రాజు అన్నాడు. వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. రైతు అనే వాడు పంచ కట్టి అరక పట్టి నారు పోసి, నీరు పోసి వ్యవసాయం చేస్తారు. కానీ చంద్రబాబు సూటు బూటు వేసి, తలపాగ కట్టి వ్యవసాయం చేస్తున్నట్లు ఫోజు కొడుతున్నారు. నారా లోకేష్‌ ట్విట్టర్‌లో వ్యవసాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భూసార పరీక్షలు చేయకుండా పంటలు సాగు చేస్తే దిగుబడులు ఎలా వస్తాయన్నారు. చంద్రన్న వ్యవసాయ క్షేత్రం అంటూ టీడీపీ కార్యకర్తలకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నారన్నారు. రైతు రథాలు అంటూ ప్రజాధానాన్ని కొల్లగొట్టి పచ్చ నేతలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఇంటికి పంపించేందుకు రైతులు ఎదురు చూస్తున్నారన్నారు.
 
Back to Top