ఎన్నికలొస్తున్నాయని బీసీలపై కపట ప్రేమ

నెల్లూరు: ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ బీసీల అణచివేత ధోరణికి నిరసనగా నెల్లూరులో అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో అనిల్‌కుమార్‌ యాదవ్, భాస్కర్‌గౌడ్, రూప్‌కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు జీతాలు ఇవ్వాలని కోరిన నాయీ బ్రాహ్మణులను కించపరిచాడని ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని బీసీల మీద అమితమైన ప్రేమ ఉన్నట్లుగా బిల్డపులు ఇస్తున్నాడన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ అని చెప్పి మోసం చేశాడని, బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి గుణపాఠం చెప్పాలని, బీసీలను కించపరిచిన చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

తాజా వీడియోలు

Back to Top