మంత్రులు ఉత్తమ్‌, జానా దిష్టిబొమ్మల దహనం

హుజూర్‌నగర్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటనను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకున్న మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను పార్టీ నాయకులు దగ్ధం చేశారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ‌ఈ ఆందోళనలో పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో తన మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉందని భావించిన మంత్రి తెలంగాణవాదం ముసుగులో ఇతర జిల్లాల నుంచి అల్లరిమూకలను దింపి అలజడి సృష్టించారని మండిపడ్డారు. మంత్రి ఉత్తం ప్రోద్బలంతోనే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కొందరు దుండగులు‌ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారని ‌పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ నాయకులు వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్య యాదవ్ తదితరులు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నేరేడుచర్లలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పోరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వచ్చిన విజయమ్మను అడ్డుకోవడం అమానుషం అన్నారు. కాగా, విజయమ్మ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

Back to Top