మంత్రులే బాక్సైట్‌ను దోచుకుంటున్నారు..

శ్రీకాకుళంః బాక్సైట్‌ను టీడీపీ మంత్రులే దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర విమర్శించారు. విశాఖలో 2014  ముందు ఎవరు దరఖాస్తు చేసిన అనుమతులు ఇవ్వలేదని,టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్‌ తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయన్నారు.ఈ విషయాన్ని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి కూడా స్పష్టం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. 2013లో గిరిజన సలహామండలిలో తీర్మానం చేసి తవ్వకాలను రద్దు చేయించామన్నారు. 
టీడీపీ ప్రభుత్వం వచ్చి జీవో 97 ఇచ్చి బాక్సైట్‌ తవ్వకాలు  మొదలుపెట్టారన్నారు.లెటరైట్‌ పేరిన బాక్సైట్‌ తవ్వుతున్నారన్నారు.బాక్సైట్‌ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గిరిజనుల సంపదను దోచుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీకి గిరిజనులు బుద్ధి చెప్పాలన్నారు.
 
Back to Top