విపత్తు వ్యవస్థ' మెరుగ్గా ఉండాలి: మేకపాటి

న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాన్ని తగ్గించాలంటే విపత్తు నిర్వహణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేపాల్, ఉత్తర భారతదేశంలో భూకంపం సృష్టించిన విలయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం మధ్యాహ్నం లోక్‌సభలో అన్ని పార్టీలు భూకంపం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఆపలేకపోయినా.. విపత్తు నిర్వహణ మెరుగ్గా ఉంటే నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలన్నారు.
Back to Top