ప్రజలే నిర్ణయం తీసుకుంటారుఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు మేం చేసిన రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఎట్టకేలకు ఆమోదించారు. పట్టుబట్టి మరీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించుకున్నారు. అనంతరం ఆయన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..లోక్‌సభ స్పీకర్‌ ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితమే కలిశామన్నారు. వ్యక్తిగతంగా లేఖలు అందిస్తే రాజీనామాలపై నిర్ణయంతీసుకుంటామన్నారు. వెంటనే లేఖలు అందజేయడంతో మా రాజీనామాలు ఆమోదించారని చెప్పారు. జరిగిన విషయాలను ఏపీ ప్రజలకు చెబుతామని, ఇందులో ఏమీ దాపరికం లేదన్నారు. చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top