మేకా ప్రతాప్ అప్పారావు హౌజ్ అరెస్ట్

కృష్ణాజిల్లా : నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుపై టీడీపీ ఎమ్మెల్యే ముద్దరబోయిన అవినీతి ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్, ముద్దరబోయినకు బహిరంగ సవాల్ విసిరారు. అంతేగాకుండా స్థానిక పెద్దగాంధీ సెంటర్లో ఎమ్మెల్యే మేకా ప్రతాప్, తన అనుచరులతో బహిరంగ చర్చకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. ముందస్తుగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  టీడీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Back to Top