మరో ప్రజాప్రస్థానం శనివారానికి వాయిదా

గుంటూరు:

దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల గుంటూరు జిల్లా పాదయాత్ర శనివారానికి వాయిదా పడింది. ఆమె షెడ్యూల్‌లో మార్పు చేసినట్టు పార్టీ జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్, కార్యక్రమాల కమిటీ కన్వీనరు తలశిల రఘురామ్ వెల్లడించారు.  ఆమె శనివారం గురజాల నియోజకవర్గంలో 10. 5 కిలోమీటర్లు నడుస్తారన్నారు.  జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర మరో ప్రజాప్రస్థానం సాగుతుంది. హైదరాబాద్ పేలుళ్లలో మృతి చెందిన కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఈ దుశ్చర్యలలో బలవుతున్నది అమాయకులేనని వారు పేర్కొన్నారు, దోషులను వెంటనే పట్టుకోవాలని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనరు అప్పిరెడ్డి వేర్వేరు పక్రటనల్లో ఖండించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కె) రావి వెంకట రమణ, కోన రఘుపతి, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మరో ప్రకటనలో మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. నిఘా సంస్థల పనితీరు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన రుజువు చేస్తోందన్నారు.

Back to Top