మరో ప్రజా ప్రస్థానంలో పూలబాట

వేల్పుల: మహానేత తనయ షర్మిలకు వేల్పుల ప్రజలు తమ అభిమానాన్ని కొత్త తరహాలో చాటుకున్నారు. పూలపై నడిపించి వారి ప్రేమానురాగాలను ప్రదర్శించారు. వేల్పులలో పూసే ప్రతి పూవులోనూ రాజశేఖరరెడ్డి నవ్వు కనిపిస్తుందని వారు పేర్కొనడం విశేషం. ఆమెకు హారతులిచ్చారు. కరచాలనానికి పోటీలు పడ్డారు. అభిమానమంటే ఎలా ఉండాలో చూపించారు. ఆత్మీయ స్వాగతం నడుమ ఆమె యాత్ర సాగింది. వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, తదితరులు ఆమె వెంట ఉన్నారు. వేలాది సంఖ్యలో వచ్చిన ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.  టపాకాయలు కాల్చి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top