పోలవరం సకాలంలో పూర్తి చేయండి

న్యూఢిల్లీ:  పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యితేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌స‌భ‌లో మిథున్‌రెడ్డి ప‌లు అంశాల‌పై ప్ర‌సంగించారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న గ‌డువులోగా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని కోరారు. ధ‌ర్మ‌ల్  ప‌వ‌ర్ ఉత్ప‌త్తికి స‌రిప‌డ బొగ్గులేక ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని వివరించారు.  లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి స‌రైన కేటాయింపులు జ‌ర‌గ‌లేద‌న్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Back to Top