వైఎస్సార్సీపీలో చేరిన మహేష్ బాబు ఫ్యాన్స్

గుంటూరుః పిడుగురాళ్ల పట్టణానికి చెందిన హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ వైఎస్సార్సీపీలో చేరారు. మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో...అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున స్థానిక గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జంగా కృష్ణమూర్తి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అసోసియేషన్ తరపున వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. గురజాలలో జంగా కృష్ణమూర్తి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.
Back to Top