మహానేత వైయస్‌ఆర్‌కు మందిరాలు, పూజలు

హైదరాబాద్‌, 2 సెప్టెంబర్‌ 2012 : ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడం కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన మహానేత వైయస్‌ఆర్‌ను తలుచుకుని రాష్ట్రం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం వాసులు కూడా కన్నీరుమున్నీరయ్యారు. తమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాజన్న ఇంక తిరిగి రాడా అంటూ విలపించారు.

మహానేత భౌతికంగా తమ మధ్య లేకపోయినా ఆయన అందించిన స్ఫూర్తిని జీవింతాంతం గుర్తుంచుకునే విధంగా ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమవంతుగా చందాలు వేసుకుని గ్రామం మధ్యలో ఓ ఆలయాన్ని నిర్మించారు. వైయస్ ప్రతిమను అందులో ప్రతిష్టించుకున్నారు. నిత్యం ఆక్కడ ‌జననేతకు పూజలు నిర్వహిస్తున్నారు.

రాజన్నను ఎప్పటికీ మరచిపోలేమంటోంది ఆ కుటుంబం. నల్గొండలో వ్యాపారవేత్త అయిన మేరెడ్డి నరేందర్‌రెడ్డికి దివంగత నేత వైయస్‌ఆర్‌ అంటే ఎంతో అభిమానం. మహానేత మరణానంతరం తన ఇంటిలోనే పెద్దాయనకు మందిరాన్ని నిర్మించాడు. వైయస్‌‌ఆర్ మూడవ వర్ధంతి సందర్భంగా బంధుమిత్రులందరినీ పిలిచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు చేయించారు.

మహానేత లేని లోటు స్పష్టం కనిపిస్తోందని, సామాన్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారని విశాఖ వాసులు అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మర్రిపాలెం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పలువురు పూజలు నిర్వహించారు.

Back to Top