మహానేత పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

హిందూపురం:

ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ లేనట్లుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి సాగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చౌళూరు రామకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు, రిటైర్డు రైల్వే ఉద్యోగి మల్లికార్జున చెప్పారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని మోడల్ కాలనీలో 12వ వార్డు ప్రజలు 50 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వార్డు మహిళ రిహానా ఆధ్వర్యంలో కండువాలు వేసి నాయకులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానంగా యువత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేద ముస్లింలు విద్య, ఉద్యోగాల్లో రాణించాలన్న లక్ష్యంతో డాక్టర్ వైయస్ఆర్ రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ తెచ్చారన్నారు. ఆ మహానేతను దేవుడంటూ మొక్కిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇపుడు ఆయననే విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

Back to Top