'మహానేత కుటుంబానికి రుణపడి ఉంటా'

రాజోలు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలోని ఆయన స్వగృహంలో గురువారం ఆయన మాట్లాడారు. అవకాశాలు కోసమో, రాజకీయ లబ్ధి కోసమో కాకుండా ప్రజాభీష్టం మేరకే వైయస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఆ పార్టీలో సామాన్య కార్యకర్తగానే సేవలందిస్తానని శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డికి చెప్పానన్నారు. 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో మహానేత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వేణు తెలిపారు. 2003లో పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ పదవి, 2006లో జెడ్పీ చైర్మన్, 2007 కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా, 2008లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైయస్ఆర్ అవకాశం కల్పించారన్నారు. అవకాశాల ఆధారంగా పదవులు రావని ఆయన అన్నారు.

Back to Top