మా కార్యకర్తలు బంగారం శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మా కుటుంబానికి అండగా నిలిచారని, వారే అసలైన బంగారమని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.  ఉప ఎన్నికలో  సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. మాకు అండగా నిలిచిన కార్యకర్తలు అంతా కూడా స్వచ్ఛమైన బంగారం లాంటి వారని ఆయన అభివర్ణించారు. టీడీపీ నేతలు ఎన్నో రకాలుగా బెదిరించిన నంద్యాలలో  భారీ మెజారిటీతో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం మూడుసార్ల నంద్యాలలో పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో మకాం వేసి ఓటర్లను మభ్యపెట్టినా విజయం వైయస్‌ఆర్‌సీపీదే అన్నారు. టీడీపీ ఆది నుంచి కుట్రలు చేసిందని, మా అన్న నామినేషన్‌ చెల్లకుండా చేశారని విమర్శించారు. టీడీపీ తరఫున మా అన్న పోటీ చేసినప్పుడు కూడా అదే లాయర్‌ కూడా నోటరీ సంతకం చేశారు. ఉప ఎన్నికలో  కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని మభ్యపెట్టారన్నారు. మా నాయకుడు రాజగోపాల్‌రెడ్డిని ఒంగోలు జిల్లాకు వచ్చిన కార్యకర్తలు దాడి చేసేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7వ వార్డు కౌన్సిలర్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. నేనేమైనా ఖూనీకోరునా? రౌడీనా? ఏదో విధంగా భయపెట్టాలని చూశారని ఫైర్‌ అయ్యారు. నా ఆధార్‌కార్డు కూడా ఇక్కడే ఉంది. అయినా నన్ను ఇబ్బంది పెట్టారని మీడియాకు తెలిపారు.  

Back to Top