లోక్‌సభ సమన్వయకర్తల నియామకం


గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా కిలారి వెంకట రోశయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా విశాఖపట్టణానికి చెందిన కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
 
Back to Top