యువభేరిని విజయవంతం చేద్దాం

కర్నూలు: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కర్నూలు నగర శివార్లలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే యువభేరి కార్యక్రమానికి మంగళవారం వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.  విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహించి హోదా ఆవశ్యక తను తెలియజెప్పనున్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను బయటపెట్టనున్నారు. 

వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యువభేరి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కన్వెక‌్షన్‌ హాల్‌లో వేదిక నిర్మాణం సాగుతోంది. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా కార్యక్రమ వివరాలను ప్రకటిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో యువభేరికి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లా నలుమూలల నుంచి యువకులు, విద్యార్థులు భారీగా  తరలివచ్చి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.
Back to Top