<br/><br/>విజయనగరంః ఆరోగ్యశ్రీ పథకంలో లెప్రసీ ఆస్పత్రిని చేర్చి అభివృద్ధికి సహకరించాలని సాలూరు ఫిలదెల్పియా లెప్రసీ ఆసుపత్రి ప్రతినిధులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో కొత్త లెప్రసీ కేసులు నమోదు అవుతున్నాయని మరింత మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం స్కీంలను వర్తింపచేయాలన్నారు.రోగులకు సుమారు 2 నెలల నుంచి మూడు నెలల వరుకు ఆసుపత్రిలో వైద్యం చేయాల్సి వుంటుందని దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.