పాలకుల నిర్లక్ష్యం.. ప్రాణాలతో చెలగాటం

గుంటూరు కలుషిత నీటి సరఫరాతో 10 మంది మృతి
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 250 మంది ప్రజలు
కలుషిత నీటిని అరికట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌కు  వినతిపత్రం 
గుంటూరు: పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. గుంటూరు జిల్లాలో కలుషిత నీటి కారణంగా పది మంది ప్రాణాలు పోగొట్టుకోగా, మరో 250 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాత గుంటూరు, వినోభానగర్, ఆనందపేట, సంగడిగుంట పరిధిలోని ప్రజలు నగర కార్పొరేషన్‌ సరఫరా చేసిన కలుషిత నీటితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ 10 మంది మృతి చెందినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలుషిత నీటిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు. కలుషిత నీటి నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశామన్నారు. 
Back to Top