<br/>గుంటూరు: పదేళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని పక్కనపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంట్రాక్ట్ లెక్చరర్స్ వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ పేరుతో మమ్మల్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు వాపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం దారుమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని వారు వైయస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.