వైయస్‌ జగన్‌ సీఎం అయితే అందరికి ‘న్యాయం’


ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రకాశం జిల్లా న్యాయవాదులు పేర్కొన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 109వ రోజు చీరాల అడ్వకేట్, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు. న్యాయవాదులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని, వెల్పేర్‌ ఫండ్‌ నిధులు పెంచాలని వారు కోరారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని, వైయస్‌ జగన్‌ సీఎం కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారని దీమా వ్యక్తం చేశారు. న్యాయవాదులకు సంబంధించిన వెల్పెర్‌ ఫండ్‌ను రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షలకు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు.ౖ వెయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జననేత హామీ ఇచ్చారు.
 
Back to Top