లక్ష్యం.. జగన్‌ సిఎం: శ్రేణులకు పిలుపు

పెడన (కృష్ణా జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని పార్టీ నాయకుడు వాకా వాసుదేవరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా పెడన మండలం నందమూరులో శనివారం రాత్రి కాంగ్రెస్, ‌టిడిపిల నుంచి 600 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌పిపిలో చేరారు. పార్టీ నాయకుడు వాకా వాసుదేవరావు ఇతర నాయకులతో కలసి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్‌, టిడిపి నుంచి వచ్చిన వారికి పార్టీ సభ్యత్వాలు అందజేశారు. అనంతరం జరిగిన సభలో వాసుదేవరావు మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని వాసుదేవరావు సూచించారు. జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా అమలవుతాయని అన్నారు. శ్రీ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ‌టిడిపితో కుమ్మక్కై ఆయనను జైలుకు పంపారని, బెయిల్‌ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలో మన ముందుకు వస్తారని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top