విశాఖపట్నం : జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.అనంతరం వైఎస్ జగన్ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని వైఎస్ జగన్ కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.