క్యాలెండర్‌ను ఆవిష్కరించిన విజయమ్మ

హైదరాబాద్:

మాచర్ల శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన డాక్టర్ వైయస్  రాజశేఖరరెడ్డి చిత్రాలతో కూడిన క్యాలెండర్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో శ్రీమతి విజయమ్మను కలిసిన ఎమ్మెల్యే పిన్నెల్లి క్యాలెండర్‌ను చూపించి వాటి ప్రత్యేకతలను వివరించారు.  క్యాలెండర్ అందంగా ఉందని విజయమ్మ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెంట మాచర్ల నియోజకవర్గం పార్టీ నాయకులు పి.వెంకట్రామిరెడ్డి, వై. శ్రీనివాసరావు, బి. ఏడుకొండలు, పి. నర్సింహారావు, పీఏ శర్మ, సీహెచ్ రోశయ్య, ఎన్. గురువారెడ్డి, జె.వీరారెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top