కురుపాం ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్

కురుపాం: ప్రత్యేకహోదా కోసం ప్రజలు తెలుపుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని పోలీసులు అడ్డుకున్నారు. జీయమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉన్న ఆమె నివాసంలోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు రాకుండా మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌పై వైయస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Back to Top